రతన్‌టాటాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించిన వెంటనే తన కంటే వయసులో పెద్దవారైన టాటాకు నారాయణ మూర్తి ఆయనకు పాదాభివందనం చేశారు. గొప్ప స్నేహితుడైన నారాయణ మూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలను, వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు రతన్ టాటా. దీంతో నారాయణమూర్తి మరోసారి నెటిజన్ల ప్రశంసలను అందుకుంటున్నారు. రతన్ టాటాకు పాదాభివందనం చేసి నారాయణమూర్తి తన విధేయతను చాటుకున్నారని కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో పలువురిని అబ్బుర పరుస్తున్నాయి.
ఈ కార్పొరేట్ దిగ్గజాలకు నెటిజన్లు ఫిదా