కరెన్సీ నోట్లను గుర్తించేందుకు అంధుల కోసం మరింత ఉపయోగకరంగా ఓ యాప్ వచ్చేసింది. దీనిని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా విడుదల చేసింది.
కరెన్సీ నోట్లను గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్న అంధుల కోసం మణి (MANI) పేరుతో యాప్ అందుబాటులో ఉంది. MANI అంటే ‘మెుబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్'. మెుబైల్ సహాయంతో నోట్లను గుర్తించే యాప్ అని అర్ధం. ఈ యాప్‌ను ఇన్ స్టాల్ చేస్తే చాలు ఇంటర్ నెట్ లేకపోయినా పని చేస్తుంది. ‘MANI’ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ల కోసం ఆయా యాప్‌స్టోర్లలో అందుబాటులో ఉంది. పూర్తి ఉచితంగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కరెన్సీ నోట్లను మెుబైల్ కెమెరాతో స్కాన్ చేస్తే అవి ఎంత విలువైనయో ఆడియో రూపంలో తెలుపుతుంది. హిందీ, ఇంగ్లిష్ భాషలో ఇవి వినబడుతుంది. అయితే ఈ యాప్ ద్వారా నోటు ఒరిజినలా, డూప్లికేటా గుర్తించటం సాధ్యం కాదని ఆర్‌బీఐ తెలిపింది.